శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ap heavy rains warning : ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలకు తుఫాన్ హెచ్చరిక, రైతులు-మత్స్యకారులు అప్రమత్తం కావాలి

    1 వారం క్రితం

    విశాఖపట్నం తేదీ: 25 నవంబర్ 2025 :  రాష్ట్రంపై మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) పేర్కొంది. ఈనెలాఖరున (నవంబర్ 29–డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

     

    ప్రధాన అంశాలు:

    మలక్కా జలసంధి ప్రాంతంలో ఒక తీవ్రమైన అల్పపీడనం (Low Pressure) కేంద్రీకృతమై ఉంది. రాబోయే 6 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో వాయుగుండంగా (Cyclonic Circulation) మారే అవకాశం ఉంది. తర్వాతి 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొమోరిన్, నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఇప్పటికే కేంద్రీకృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

     

    హెచ్చరికలు మత్స్యకారులు: నవంబర్ 27 (గురువారం) నుంచి సముద్రంలో వేటకు వెళ్లకూడదని సూచన. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తిరిగి రావాలి.

    రైతులు: రాబోయే మూడు రోజుల్లో వర్షాల అవకాశం ఉన్నందున, వాతావరణ సూచనల ప్రకారం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.  ఈ వర్షాలు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మరిన్ని సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Assam CM Himanta Biswa Sarma : జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు
    తర్వాత ఆర్టికల్
    Ayodhya Dhwajarohan PM Narendra modi : అయోధ్యలో ధర్మ ధ్వజా రొహణతో భారతీయ సాంస్కృతిక చైతన్యం ప్రతిఫలించింది : ప్రధాని మోదీ

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి