kntv
kntv

ఆసియా U23లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం

1 hour ago

ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలేలో 3:18.64 నిమిషాల టైమ్‌తో స్వర్ణ పతకం సాధించింది. ఆతిథ్య చైనా (3:18.74)ను కేవలం 0.10 సెకన్ల తేడాతో ఓడించింది. చివరి ల్యాప్‌లో శ్రావణి సంగ్లే అద్భుత పరుగుతో విజయాన్ని ఖాయం చేసింది.