kntv
kntv

సబితా ఇంద్రారెడ్డి హౌజ్ అరెస్ట్.. బీఆర్ఎస్ ఆగ్రహం

1 month ago

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న యువసంగ్రామం సభకు వెళ్లకుండా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు శనివారం ఆమె నివాసంలో హౌజ్ అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా శ్రీనగర్ కాలనీలోని ఆమె ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.