శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    PM Modi : గోవా కనకోనలో 77 అడుగుల శ్రీరామ విగ్రహం ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

    4 రోజులు క్రితం

    గోవా : దక్షిణ గోవా జిల్లాలోని కనకోన పట్టణం వద్ద ఉన్న శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠంలో ప్రతిష్టించిన 77 అడుగుల ఎత్తైన శ్రీరాముని కంచు విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. మఠం 550వ వార్షికోత్సవంని పురస్కరించుకుని ఈ విగ్రహావిష్కరణ భవ్యంగా నిర్వహించారు.

     

    సాధువులు, సంతులతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని

    ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, సాధువులు, సంతులతో తనకున్న ఆధ్యాత్మిక బంధాన్ని స్మరించుకున్నారు. భారత సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వంతో ప్రజలు మరింతగా మమేకమయ్యేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి శక్తి, విలువలను యువతరం అర్థం చేసుకోవడానికి ఇలాంటి వేడుకలు ఎంతో కీలకమని అన్నారు.

     

    15,000 మంది పాల్గొన్న మహోత్సవం

    మఠం 550 సంవత్సరాల చరిత్రను గుర్తు చేస్తూ, ఈ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఆర్గనైజేషన్ కమిటీ జాయింట్ కన్వీనర్ ఎస్. ముకుంద్ కామత్ తెలిపిన మేరకు, ఈ కార్యక్రమానికి 15,000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్, అనూప్ జలోటా తదితరులు పాల్గొని ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో సభను రంజింపజేశారు.

     

    సారస్వత బ్రాహ్మణ వైష్ణవ సంప్రదాయం కలిగిన తొలి మఠం

    ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠం సారస్వత బ్రాహ్మణ వైష్ణవుల తొలి మఠంగా గుర్తించబడింది. దక్షిణ గోవాలోని పార్టగాలి ఈ మఠానికి ప్రధాన కార్యాలయం. ఈ మఠం 13వ శతాబ్దంలో జగద్గురు మధ్వాచార్యులు స్థాపించిన ద్వైత సిద్ధాంతాన్ని అనుసరిస్తూ శతాబ్దాలుగా ఆధ్యాత్మిక సేవలను అందిస్తోంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Varanasi event Mahesh Babu : మహేశ్ బాబు – రాజమౌళి ‘వారణాసి’: టైటిల్ గ్లింప్స్ వెనుక ఉన్న నిజం బయటకు! జక్కన్న విడుదల చేసిన స్పెషల్ వీడియో
    తర్వాత ఆర్టికల్
    Lionel Messi : డిసెంబర్ 13న హైదరాబాద్‌కు ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సి! అభిమానుల్లో సంబరాలు

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి