శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Lionel Messi : డిసెంబర్ 13న హైదరాబాద్‌కు ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సి! అభిమానుల్లో సంబరాలు

    4 రోజులు క్రితం

    ఇంటర్నెట్ డెస్క్ :  ఫుట్‌బాల్ ప్రపంచంలో లియోనెల్ మెస్సి పేరు వినగానే ప్రతి అభిమాని ఉత్సాహంతో నిండిపోతాడు. అర్జెంటీనా సూపర్‌స్టార్ అయినా, అతడి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అటువంటి ఫుట్‌బాల్ మహానుభావుడు లియోనెల్ మెస్సి త్వరలోనే భారత పర్యటనకు రానుండటం దేశవ్యాప్తంగా సంచలనమే.

     

    మెస్సి ప్రకటించిన హైదరాబాద్ టూర్

    మెస్సి తన సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్ట్ ప్రకారం, డిసెంబర్ 13న అతడు హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నాడు. భారత్ అందిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ప్రయాణంలో హైదరాబాద్‌ను జోడించడం తనకు ఎంతో ఆనందమని పేర్కొన్నాడు.

    మెస్సి పోస్ట్‌లో ఇలా చెప్పాడు:  “మరికొన్ని రోజుల్లో ఇండియాకు నా ప్రయాణం ప్రారంభం కానుంది. నా పై ఇండియా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నా ప్రయాణంలో హైదరాబాద్ కూడా ఉంది. ఈ సిటీని జోడించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.”

     

    కోల్‌కతా, ముంబై, ఢిల్లీ లిస్టులో

    అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ మెస్సి, తన ఇండియా టూర్లో, హైదరాబాద్ ,  కోల్‌కతా , ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలను సందర్శించనున్నాడు. అతడి పర్యటనకు సంబంధించి అభిమానులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు ప్రారంభించారు.

     

    సీఎం రేవంత్ రెడ్డి స్పందన

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మెస్సి రాకపై సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా ఇలా పేర్కొన్నారు:

    “డిసెంబర్ 13న ఫుట్‌బాల్ స్టార్ మెస్సి హైదరాబాద్ వస్తున్నాడు. అతడిని చూడాలని తపిస్తున్న ప్రతి అభిమాని కల ఆ రోజు నెరవేరబోతోంది. మెస్సికి అందరం ఘన స్వాగతం పలుకుదాం.”

     

    మెస్సి రాకతో హైదరాబాద్‌లో ఉత్సాహం పెరిగింది

    ఈ వార్త వెలువడిన వెంటనే, నగరంలో ఫుట్‌బాల్ అభిమానులు పండగ వాతావరణంలోకి వెళ్లారు. మెస్సి ప్రత్యక్షంగా చూడాలనే కోరిక ఎంతో మందికి ఉండటంతో, ఈ సందర్శన నగరానికి ప్రత్యేకమైన గుర్తుగా నిలవనుంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    PM Modi : గోవా కనకోనలో 77 అడుగుల శ్రీరామ విగ్రహం ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
    తర్వాత ఆర్టికల్
    Savitri : హైదరాబాద్‌లో ‘సావిత్రి మహోత్సవ్’: మహానటి 90వ జయంతి వేడుకలు

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి