జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులు సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన, ఎస్పీ అజిత వేజండ్లతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రేడియం పెయింటింగ్, సైనేజ్ బోర్డులు, సోలార్ బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు.
నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద బస్సుల అసమంజసపు నిలుపును నియంత్రించాలని, ప్రధాన కూడళ్లలో రోడ్డు మార్జిన్ ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సాఫీగా ఉండేలా చూడాలని మున్సిపల్, ట్రాఫిక్ శాఖలను సూచించారు. కందుకూరు, ఆత్మకూరు డివిజన్లలో జరుగుతున్న ప్రమాదాలపై సమీక్షిస్తూ అత్యవసర నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా చదవండి
మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా?
ఈ కామెంట్ తొలగించబోతున్నారు..!
తొలగించు
రద్దు చేయి