దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో లోతైన విచారణ జరగకపోతే అసలు నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని వైఎస్ సునీత తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ, వైఎస్ సునీత నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. సునీత అభ్యర్థన మేరకు అసలు నిందితులు తప్పించుకోకుండా సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ వేయడానికి సీబీఐని ఆదేశించాలని కోరారు. దీనిపై తన వాదనలో, దర్యాప్తు కొనసాగితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. తీరుపై నిందితుల తరఫు న్యాయవాదులు దర్యాప్తు కొనసాగించడంలో అవకాసం లేదని కోర్టుకు తెలియజేశారు. ఇరువైపుల వాదనలు వినిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 10న కోర్టు ఈ కేసులో తుది నిర్ణయం వెలువరిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా చదవండి
మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా?
ఈ కామెంట్ తొలగించబోతున్నారు..!
తొలగించు
రద్దు చేయి