శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Aditi Rao Hydari : రాజకుటుంబంలో పుట్టి, సినీరంగాన్ని జయించిన నటి అదితి రావు హైదరీ – ప్రేమ, విడాకులు, కొత్త జీవితం…

    1 వారం క్రితం

    హైదరాబాద్, నవంబర్ 25 :  భారతీయ సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటన, అందం, శృతి మధురమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అదితి రావు హైదరీ జీవితం, కెరీర్—ఇవన్నీ ఒక సినిమాకంటే ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయి. రాజకుటుంబం, నవాబు వంశంలో జన్మించిన ఆమెకు నటన మీదున్న ప్రేమే ఆమెను సినిమాల ప్రపంచంలోకి తెచ్చింది.

     

    రాజకుటుంబం నుంచి రజతపటం వరకు…

    2006లో మలయాళ చిత్రం ‘ప్రజాపతి’తో తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించిన అదితికి, హిందీ చిత్రం ‘దిల్లీ 6’ మంచి గుర్తింపు తెచ్చింది. అనంతరం ఆమె దక్షిణాది, బాలీవుడ్‌లో వరుసగా శక్తివంతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకుంది.

     

    వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు

    అదితి జీవితం సినిమాలా రంగులమయం కాదు. వ్యక్తిగతంగా చాలా కఠిన దశలను ఎదుర్కొంది. 21 ఏళ్ల వయసులోనే నటుడు సత్యదీప్ మిశ్రాతో పెళ్లి ఈ సంబంధం ఎక్కువ కాలం నిలవకపోవడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది . ఆ దశలో తీవ్రంగా కుంగిపోయానని, తర్వాత మళ్లీ బలంగా నిలబడినట్లు అదితి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది . ప్రస్తుతం వీరిద్దరూ స్నేహితులుగానే కొనసాగుతున్నారని వెల్లడించింది.

     

    సిద్ధార్థ్‌తో ప్రేమ, పెళ్లి – కొత్త అధ్యాయం

    విడాకుల తర్వాత సినిమాల్లో పూర్తిగా బిజీగా ఉన్న అదితి… 2021లో వచ్చిన తెలుగు చిత్రం ‘మహా సముద్రం’ షూటింగ్ సమయంలో నటుడు సిద్ధార్థ్తో పరిచయం పెరిగింది.
    ఈ పరిచయం ప్రేమగా మారి… చివరకు 2024 సెప్టెంబర్ 16న వీరిద్దరూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ కెరీర్లలో బిజీగా ఉంటూ, వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆనందంగా గడుపుతున్నారు.

     

    సినిమా కెరీర్‌లో మెరిసిన అదితి

    అదితి నటించిన ప్రధాన చిత్రాలు— రాక్‌స్టార్, మర్డర్ 3,  వజీర్, పద్మావత్, కాట్రు వెలియిడై,  సూఫియుం సుజాతయుమ్,  మహా సముద్రం. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ "హీరామండి"లో అపూర్వమైన నటన, అందంతో అదితి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

     

    ప్రస్తుతం ఏం చేస్తోంది?

    తన కెరీర్‌లో మరిన్ని ప్రత్యేక పాత్రల కోసం ఎదురు చూస్తూ, స్క్రిప్ట్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తన శైలీ, నటన, డెడికేషన్ కారణంగా ఆమెపై దర్శకుల దృష్టి ఎప్పుడూ ఉంటుంది. త్వరలోనే మరో బిగ్ ప్రాజెక్ట్‌లో అదితిని చూడొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Tamannaah’s Dream Role :తమన్నా డ్రీమ్ రోల్: “శ్రీదేవి బయోపిక్ వస్తే.. నా జీవితంలోని గొప్ప గౌరవం!”
    తర్వాత ఆర్టికల్
    Deputy Cm Pawankalyan : సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు, శాఖల అనుసంధానం పై పవన్ కళ్యాణ్ హై-లెవల్ రివ్యూ

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి