శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Tirumala: తిరుమల టెంపుల్ సిటీలో అన్య మత స్టిక్కర్ కలకలం: వాహనం డ్రైవర్‌–యజమానిపై కేసు నమోదు

    1 వారం క్రితం

    తిరుమలలో అన్య మత చిహ్నం ఉన్న స్టిక్కర్‌తో ఒక వాహనం సంచరించడం ఆలయ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది. తిరుమల కొండపై ఆ వాహనం కనిపించడంతో టీటీడీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే ఈ విషయంపై తిరుమల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    పోలీసులు చర్యలు తీసుకుని, వాహనం డ్రైవర్‌ గోబి మరియు వాహన యజమానిపై AP Charitable & Hindu Religious Institutions and Endowments Act – 1987లో కేసు నమోదు చేశారు. ఈ వాహనం తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లాకు చెందినదిగా, నెంబర్ TN-31-AE-4073గా గుర్తించారు.

    చెక్‌పోస్ట్ వద్ద నిర్లక్ష్యం

    గురువారం ఉదయం 10.40 గంటల సమయంలో అలిపిరి చెక్‌పోస్టులోని 9వ లేన్ గుండా ఈ వాహనం ప్రవేశించినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడ విధుల్లో ఉన్న CT-5949 వి. వాసు బాబు వాహనంపై ఉన్న అన్య మత చిహ్నాన్ని గమనించకపోవడం టీటీడీ అధికారులను తీవ్ర అసహనానికి గురిచేసింది. ఈ నిర్లక్ష్యానికి గాను వాసు బాబును వెంటనే అలిపిరి విధుల నుండి తప్పించి, శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు టీటీడీ వెల్లడించింది.

    వాహనం గుర్తింపు – స్టిక్కర్ తొలగింపు

    సమాచారం అందుకున్న వెంటనే, విజిలెన్స్ టీమ్ తిరుమలలో ఫైర్ ఆఫీస్ సమీపంలోని పార్కింగ్ ఏరియాలో ఆ వాహనాన్ని గుర్తించింది. అనంతరం వాహనంపై ఉన్న అన్య మత స్టిక్కర్‌ను తొలగించారు. తరువాత అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు దాఖలు చేశారు.

     

    టీటీడీ ఈ ఘటనను అత్యంత గంభీరంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేస్తూ, తిరుమల పవిత్రతను భంగం చేసే ప్రయత్నాలపై ఎటువంటి రాజీ ఉండదని హెచ్చరించింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్..పరిశ్రమలకు ఇక తిప్పలుండవు..చంద్రబాబు సర్కార్ కొత్త విధానం
    తర్వాత ఆర్టికల్
    SRH: ఐపీఎల్ రిటెన్షన్ – రీలీజ్ లిస్టులు వెలువడిన తర్వాత కొత్త చర్చలు

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి