శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Avanigadda : పేదల వైద్యానికి చంద్రబాబుగారి తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

    1 వారం క్రితం

    • సీఎంఆర్ఎఫ్ ద్వారా 32 మందికి ₹18.69 లక్షల ఆర్థిక సహాయం – ఇప్పటివరకు అవనిగడ్డ నియోజకవర్గంలో 811 మందికి ₹6.42 కోట్లకు పైగా సాయం

    అవనిగడ్డ: పేద ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు తెలిపారు. ఆదివారం అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి (C.M.R.F) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 32 మందికి మొత్తం ₹18,69,564 విలువైన ఆర్థిక సహాయం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు.

    కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సహాయం

    ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజకీయపరమైన తేడాలను పక్కన పెట్టి, అత్యవసర వైద్య అవసరాల కోసం పేదలకు వెంటనే సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. పేదలు సమర్పించే దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, ఒక్కరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

    అవనిగడ్డలో ఇప్పటివరకు 811 మంది లబ్ధిదారులు

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి నేటి వరకు అవనిగడ్డ నియోజకవర్గంలోనే 811 మందికి మొత్తం ₹6,42,23,757 విలువైన ఆర్థిక సహాయం అందించటం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకుడు మండలి వెంకట్రామ్ గారు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Telangana Housing Corporation : డబుల్ బెడ్‌రూం ఇళ్ల దుర్వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధం – POT చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు
    తర్వాత ఆర్టికల్
    Guwahati Test : గువాహటి టెస్టులో భారత్ కుప్పకూలింది – ఫాలో ఆన్ గండం తప్పదా?

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి