kntv
kntv

అయోధ్య రామమందిరంలో భక్తుల వెల్లువ

2 hours ago

శ్రావణ మాసం సందర్భంగా అయోధ్య రామమందిరానికి భక్తుల రాక భారీగా పెరిగింది. వేలాది మంది భక్తులు దర్శనం కోసం తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. రద్దీ నియంత్రణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత మూడు రోజుల్లో రోజుకు 75 వేల నుంచి 1.25 లక్షల మంది వరకు భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.