kntv
kntv

బీజంపల్లి ఎస్ఎంసీ కమిటీ ఎన్నిక

55 minutes ago

బీజంపల్లి పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా, ఏకగ్రీవంగా జరిగాయి. ఎస్ఎంసీ చైర్మన్‌గా షేక్ నాయబ్ రసూల్, వైస్ చైర్మన్‌గా దేవసాని ప్రభావతి ఎన్నికయ్యారు. మరో 13 మంది సభ్యులుగా, ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉపాధ్యాయుడు ఈర్ల సాయిబాబుతో పాటు మరో నలుగురు ఎన్నికయ్యారు. ఎన్నికలు సజావుగా జరగడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.