kntv
kntv

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ

2 hours ago

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు Allu Arjunకు నాంపల్లి కోర్టు వ్యక్తిగత సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కేసులో మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలుకాగా, అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చారు. నిందితుల హాజరు అనంతరం పూర్తి స్థాయి విచారణ ప్రారంభం కానుంది.