kntv
kntv

ఒకే రోజులో 35 కోట్ల మొక్కలు.. యూపీ కొత్త రికార్డు

1 hour ago

ఉత్తరప్రదేశ్‌లో ఒకే రోజులో 35 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో తొలి మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత తొమ్మిదేళ్లలో ఇప్పటికే 242 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు ప్రభుత్వం పేర్కొంటూ, దీనిని పర్యావరణ పరిరక్షణకు అంకితమైన మహాయజ్ఞంగా అభివర్ణించింది.