kntv
kntv

ఆకస్మిక తనిఖీ చేసిన చైర్మన్ రమేష్ నాయుడు

1 hour ago

ధర్మకర్తల మండలి అధ్యక్షులు రమేష్ నాయుడు ఈ రోజు సాయంకాలం లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రాన్ని ఆకస్మికoగా తనిఖీ చేశారు. లడ్డు ప్రసాద విక్రయకేంద్రాలలో స్టాకు నమోదును పరిశీలించారు. లడ్డు ప్రసాద టికెట్టు జారీ విధానాన్ని పరిశీలించారు. కౌంటరులోని అమ్మకాలతో నగదుతో సరిపోల్చి చూశారు. లడ్డు మరియు పులిహోర ప్రసాదాల తయారీలో విధిగా ఎప్పటికప్పుడు శుచీశుభ్రతలను పాటిస్తుండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు చైర్మన్