kntv
kntv

దుష్ప్రచారాలకు కేరాఫ్‌గా మారిన బీఆర్ఎస్: కాంగ్రెస్

1 hour ago

అశ్వారావుపేట: గుమ్మడవల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు అర్హులకే జరిగాయని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, వీఓ భవనం, తాగునీటి బోర్లు ఏర్పాటు చేసినా అభివృద్ధిని గుర్తించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.