kntv
kntv

పరిశ్రమల అనుమతుల్లో వేగం పెంచాలి: కడపDRO

33 minutes ago

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పరిశీలించి, అనుమతుల్లో జాప్యం చేయొద్దని డీఆర్వో మల్లికార్జునుడు అధికారులను ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన 11,905 దరఖాస్తుల్లో 11,774కు అనుమతులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 36 దరఖాస్తులను కూడా త్వరగా పరిశీలించాలని డీఆర్వో సూచించారు.