kntv
kntv

ఆర్మేనియాకు 1,000 పినాకా రాకెట్లు భారత్ కీలక రక్షణ ఎగుమతి

22 minutes ago

 

భారత్ రక్షణ ఎగుమతుల్లో కీలక ముందడుగు పడింది. ఆర్మేనియాతో కుదిరిన రూ.2,000 కోట్ల ఒప్పందంలో భాగంగా 1,000 గైడెడ్ పినాకా రాకెట్ల తొలి విడత సరఫరా పూర్తయింది. DRDO అభివృద్ధి చేసిన ఈ రాకెట్లు 70 కి.మీ.కు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. పినాకా వ్యవస్థను కొనుగోలు చేసిన తొలి విదేశీ దేశంగా ఆర్మేనియా నిలిచింది.