kntv
kntv

నవరస నటసార్వభౌముడు ఎస్వీఆర్‌కు ఘన నివాళి

1 hour ago

సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తన అపూర్వ నటనా వైభవంతో తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు ఎస్వీ రంగారావు జయంతి సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. నవరస నటనా చాతుర్యంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సేవలను స్మరించుకున్నారు.