kntv
kntv

కైలాస్ యాత్రికులకు కేంద్రం కీలక హెచ్చరిక

2 months ago

కైలాస్‌-మానససరోవర్‌ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ప్రైవేటు టూర్‌ ఆపరేటర్ల వివరాలను ధ్రువీకరించుకున్న తర్వాతే యాత్రకు వెళ్లాలని తెలిపింది. చైనా వీసా, అవసరమైన పర్మిట్లు పొందాకే భారత్‌ నుంచి బయల్దేరాలని సూచించింది. పత్రాలు లేకుండా నేపాల్‌కు వెళితే యాత్రకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.