kntv
kntv

జగన్‌పై వ్యాఖ్యలు చేస్తే సహించం: వైసీపీ హెచ్చరిక

1 hour ago

పవన్ కళ్యాణ్, నానాజీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చంద్రబాబు ఎజెండాతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని విమర్శించింది. మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించింది.