kntv
kntv

పులివెందుల: కండక్టర్, మహిళ మధ్య మాటకు మాట

55 minutes ago

పులివెందుల నుంచి ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కండక్టర్, మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బస్సు డోర్ వద్ద మహిళలు నిలబడటంతో సర్దిచెప్పిన కండక్టర్, అలా నిలబడితే కిందకు దిగిపోవాలని అనడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఊహించని పరిణామాన్ని చూసి తోటి ప్రయాణికులు విస్తుపోయారు. ఈ ఘటన బస్సులో కొంతసేపు చర్చనీయాంశమైంది.