kntv
kntv

వైభవంగా అప్పన్న సింహగిరి గిరిప్రదక్షిణ మహోత్సవం

1 hour ago

విశాఖలో అప్పన్న సింహగిరి గిరిప్రదక్షిణ మహోత్సవం వైభవంగా ప్రారంభ మైంది. అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. పుష్పాలతో అలంకరించిన రథానికి ప్రత్యేక పూజల అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య అడివరం మీదుగా 32 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ ప్రారంభమైంది.