kntv
kntv

ట్రాక్టర్లో తరలిస్తున్న వరిగడ్డి దగ్ధం....

1 month ago

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. ట్రాక్టర్లలో తరలిస్తున్న వరిగడ్డి ప్రమాదవశాత్తు విద్యుత్ కరెంటు తీగలకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి వరిగడ్డి పెద్ద ఎత్తున దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానికులు, రైతులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.