శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Gold Demand Drop in India : దిగుమతి సుంకం పెంపుతో బంగారం డిమాండ్‌కు భారీ దెబ్బ.. 70 శాతం తగ్గుదల

    53 minutes ago

    భారత్‌లో బంగారానికి డిమాండ్ గణనీయంగా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచిన తర్వాత, మే 27తో ముగిసిన 15 రోజుల వ్యవధిలో డిమాండ్ 25 టన్నుల నుంచి 7.5 టన్నులకు పడిపోయినట్లు సమాచారం. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ మారక నిల్వలను సంరక్షించేందుకు కేంద్రం మే 13న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. దీంతో బంగారు నగల విక్రయాలు దేశవ్యాప్తంగా మందగించినట్లు Indian Bullion and Jewellers Association పేర్కొంది.

    దిగుమతి సుంకం పెంపు కారణంగా బంగారంపై మొత్తం పన్ను భారం (జీఎస్టీతో కలిపి) 9.18 శాతం నుంచి 18.45 శాతానికి పెరిగిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇంధన, ఆహార ధరల పెరుగుదలతో పాటు వినియోగదారులు ఖర్చులను నియంత్రించుకోవడం కూడా బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపిందని పేర్కొన్నాయి. అదనంగా అధిక మాసం కారణంగా కూడా కొనుగోళ్లు తగ్గినట్లు నగల వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశంలోని అసంఘటిత నగల వ్యాపార రంగంపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఐబీజేఏ ప్రతినిధులు వెల్లడించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Arsenal vs PSG Live : Arsenal chase first Champions League crown as PSG eye back-to-back titles
    తర్వాత ఆర్టికల్
    PAK vs AUS 1st ODI Live: Babar Azam and Sahibzada Farhan steady Pakistan innings

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి