శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    రామాయణంలోని మౌన త్యాగమూర్తి ఊర్మిళా దేవి.. లక్ష్మణుడి విజయానికి అసలు కారణమా?

    16 hours ago

    రామాయణంలో ఎక్కువగా శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు వంటి ప్రధాన పాత్రల గురించే ప్రస్తావన వస్తుంది. కానీ మౌనంగా మహా త్యాగం చేసిన ఊర్మిళా దేవి గురించి చాలా మందికి పూర్తిగా తెలియదు. మిథిలా రాజు జనక మహారాజు రెండవ కుమార్తె అయిన ఊర్మిళా దేవి, లక్ష్మణుడిని వివాహం చేసుకుని కొద్దికాలమే దాంపత్య జీవితం గడిపింది. అనంతరం శ్రీరాముడితో పాటు లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, తన భర్త ధర్మానికి ఆటంకం కలగకూడదనే భావంతో ఊర్మిళా దేవి అయోధ్యలోనే ఉండిపోయింది. ఆమె మౌన త్యాగం రామాయణంలో అత్యంత గొప్ప ఘట్టాలలో ఒకటిగా భావిస్తారు.

    పురాణ కథనాల ప్రకారం, అడవిలో శ్రీరాముడు మరియు సీతమ్మను రక్షించేందుకు లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోకుండా సేవ చేయాలని సంకల్పించాడు. అప్పుడే నిద్రాదేవి ప్రత్యక్షమై, మానవుడు నిద్ర లేకుండా జీవించడం సాధ్యం కాదని చెప్పగా, లక్ష్మణుడు తన నిద్రను భార్య ఊర్మిళకు ప్రసాదించాలని కోరాడని చెబుతారు. భర్త కర్తవ్యసాధన కోసం ఊర్మిళా దేవి ఆ నిద్రను స్వీకరించి 14 సంవత్సరాలు నిద్రలోనే గడిపిందనే విశ్వాసం ఉంది. ఈ ఘట్టమే “ఊర్మిళా నిద్ర”గా ప్రసిద్ధి చెందింది. లక్ష్మణుడి అచంచల సేవ వెనుక ఉన్న అసలైన శక్తి ఊర్మిళా దేవి త్యాగమేనని భక్తులు విశ్వసిస్తారు.

    ఇక రావణుడి కుమారుడు ఇంద్రజిత్తుకు “14 సంవత్సరాలు నిద్రాహారాలు మానిన వ్యక్తి చేతిలోనే మరణిస్తాను” అనే వరం ఉండటంతో, లక్ష్మణుడు అతన్ని సంహరించగలిగాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ విజయానికి మూలకారణం ఊర్మిళా దేవి చేసిన మౌన త్యాగమేనని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. కుటుంబ సౌఖ్యం, ఓర్పు, పాతివ్రత్యానికి ప్రతీకగా నిలిచిన ఊర్మిళా దేవిని స్మరించుకోవడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని విశ్వాసం. అందుకే రామాయణంలో ఘోష లేకుండా నిలిచిన మహా త్యాగమూర్తిగా ఊర్మిళా దేవి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    IPL’s explosive media rights growth unmatched in global sport: Dhumal
    తర్వాత ఆర్టికల్
    Rumer Willis alleges she was emotionally abused by ex

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి