శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    రణ్‌వీర్ సింగ్‌పై FWICE నాన్-కోఆపరేషన్ చర్య.. ‘డాన్ 3’ వివాదం ముదురుతోంది

    12 hours ago

    Federation of Western India Cine Employees (FWICE) బాలీవుడ్ స్టార్ Ranveer Singhపై కఠిన వైఖరి అవలంబించింది. దర్శకుడు Farhan Akhtar తెరకెక్కిస్తున్న Don 3 సినిమా నుంచి రణ్‌వీర్ సింగ్ ఆకస్మికంగా తప్పుకోవడంతో ఈ వివాదం మొదలైంది. షూటింగ్ ప్రారంభానికి కేవలం మూడు వారాల ముందు రణ్‌వీర్ ప్రాజెక్ట్‌ను వదిలేయడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం జరిగిందని FWICE ఆరోపించింది.

    FWICE చీఫ్ అడ్వైజర్ Ashoke Pandit మీడియాతో మాట్లాడుతూ, ఏప్రిల్ 11న ఫర్హాన్ అక్తర్ అధికారిక ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రణ్‌వీర్ సింగ్‌కు మూడు సార్లు నోటీసులు పంపినప్పటికీ, ఆయన వ్యక్తిగతంగా హాజరుకాలేదని పేర్కొన్నారు. మరోవైపు నిర్మాతలు Excel Entertainment తరఫున రితేష్ సిద్ధ్వానీ FWICE కార్యాలయానికి హాజరుకాగా, ఫర్హాన్ అక్తర్ లండన్‌లో ఉండటంతో జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

    ఈ పరిణామాల అనంతరం FWICE రణ్‌వీర్ సింగ్‌పై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ జారీ చేసింది. అయితే ఇది పూర్తిస్థాయి లీగల్ బ్యాన్ కాదని, తమ సభ్యులు ఆయనతో పని చేయవద్దని సూచించే చర్య మాత్రమేనని సంస్థ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వివాదం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారగా, రణ్‌వీర్ సింగ్ లీగల్ టీమ్ తదుపరి చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    IPL players barred from using smart sunglasses by BCCI - Here's why
    తర్వాత ఆర్టికల్
    A truce, $300 billion investment & Hormuz: What's in the draft deal that can end US-Iran war?

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి