శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    సెమీకండక్టర్ రంగంలో భారత్‌కు భారీ ముందడుగు.. ఒడిశా-ఇంటెల్-3DGS ఒప్పందం

    13 hours ago

    Odisha ప్రభుత్వం, Intel మరియు 3D Glass Solutions మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. భారతదేశానికి అత్యాధునిక సబ్‌స్ట్రేట్ తయారీ సాంకేతికతను తీసుకురావడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. దేశంలో సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, హైటెక్ తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

    ఈ ఒప్పందంపై కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ మంత్రి Ashwini Vaishnaw స్పందిస్తూ ఒడిశా ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతదేశంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ విలువ గొలుసులో ఒడిశా ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద ముందడుగు వేసిందని, ఇది చిప్ ప్యాకేజింగ్ రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టే అవకాశం ఉందన్నారు.

    ఇప్పటికే 2025లో ఒడిశాలో సెమీకండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. SiCSem Private Limited మరియు 3D గ్లాస్ సొల్యూషన్స్ ప్రాజెక్టులు రాష్ట్రంలో స్థాపించబడుతున్నాయి. అలాగే యూకేకు చెందిన క్లాస్-సిక్ వేఫర్ ఫ్యాబ్ లిమిటెడ్ భాగస్వామ్యంతో భువనేశ్వర్‌లోని ఇన్ఫో వ్యాలీలో భారతదేశపు తొలి వాణిజ్య కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటవుతోంది. ఈ ప్రాజెక్టులు దేశంలో చిప్ తయారీ రంగానికి కొత్త దిశను చూపనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Good fathers teach their sons these 7 harsh but powerful life lessons
    తర్వాత ఆర్టికల్
    Jason Sanjay's 'Sigma' release date officially announced

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి