శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Fiber Deficiency in India : భారతీయుల్లో 70% మందికి ఫైబర్ లోపం.. మహిళల్లో మరింత ఆందోళనకర పరిస్థితి

    53 minutes ago

    భారతీయుల్లో దాదాపు 70 శాతం మంది రోజువారీ అవసరమైన ఫైబర్ (పీచుపదార్థం) తీసుకోవడం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. 2021 నుంచి 2025 మధ్యకాలంలో 6.5 లక్షల మందికి పైగా పాల్గొన్న సర్వే ఆధారంగా ఈ వివరాలు బయటపడ్డాయి. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తమ ఆహారంలో తగినంత ఫైబర్‌ను చేర్చుకోవడం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపించింది. పురుషుల్లో 63 శాతం మందికి ఫైబర్ లోపం ఉండగా, మహిళల్లో ఇది 73 శాతానికి పైగా నమోదైంది. Indian Council of Medical Research–National Institute of Nutrition మార్గదర్శకాల ప్రకారం మహిళలు రోజుకు కనీసం 25 గ్రాములు, పురుషులు 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి.

    ఈ అధ్యయనం ప్రకారం ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు ఫైబర్ లోపానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే రోజూ పలు రకాల ధాన్యాలు తీసుకుంటుండగా, సుమారు 40 శాతం మంది పండ్లను తగినంతగా తినడం లేదు. అలాగే 60 శాతం మంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదని, 30 శాతం మంది మాత్రమే సరిపడా నీరు తాగుతున్నారని సర్వే వెల్లడించింది. నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటి సమస్యలు కూడా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం వంటి సమస్యలను నివారించవచ్చని సూచిస్తున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Pakistan national cricket team : వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్‌కు అరుదైన ఘనత.. 1000 మ్యాచ్‌లు పూర్తి చేసిన మూడో జట్టు
    తర్వాత ఆర్టికల్
    Mamata Banerjee : అభిషేక్ బెనర్జీపై దాడి.. బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు

    సంబంధిత లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి