kntv
kntv

కాకినాడలో 'క్యాచ్ ది రైన్' ర్యాలీ

1 month ago

వర్షపు నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన 'క్యాచ్ ది రైన్' కార్యక్రమంలో భాగంగా బుధవారం కాకినాడలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాటర్ వర్క్స్ కార్యాలయం సమీపం నుంచి ప్రారంభమైన ర్యాలీని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు.