శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Nara Chandrababu Naidu Fire On Bakkani Narismlu : తెలంగాణపై వ్యాఖ్యలు సరికావు.. బక్కని నర్సింలుకు చంద్రబాబు చురకలు

    5 hours ago

    టీడీపీ మహానాడులో తెలంగాణపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు Bakkani Narsimhulu చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీయగా, తాజాగా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పందించారు. తెలంగాణలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించిన చంద్రబాబు, బక్కని చేసిన వ్యాఖ్యలు సరికావని స్పష్టం చేశారు. పార్టీ కీలక నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన, తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగుజాతి ఒక్కటేనని పేర్కొన్నారు.

    ఏ ప్రాంతం ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయకూడదని చంద్రబాబు హితవు పలికారు. టీడీపీ పుట్టింది తెలంగాణ గడ్డపైనేనని గుర్తు చేసిన ఆయన, ఇప్పటికీ తెలంగాణలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. కాగా, మహానాడులో బక్కని నర్సింలు "తెలంగాణ అనే పదమే డిక్షనరీలో లేదని" చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలోని పాత సామాజిక వ్యవస్థలు, వెట్టిచాకిరి వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ పాలన తర్వాతే నిజమైన మార్పు వచ్చిందన్న ఆయన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. దీంతో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    PM Narendra Modi Mann Ki Baat : వడగాల్పులపై ప్రధాని మోదీ హెచ్చరిక.. దేశీయ పానీయాలు తాగాలని ప్రజలకు సూచన
    తర్వాత ఆర్టికల్
    8 simple ways to support independence at home for children

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి