శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    GHMC : హైదరాబాద్‌లో ఎన్నికల హడావుడి.. నవంబర్‌లో GHMC పోరుకు రంగం సిద్ధం!

    6 hours ago

    హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక కదలికలు ప్రారంభమయ్యాయి. పునర్విభజన అనంతరం ఏర్పడిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ముందుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ రెండో వారంలో ఓటరు జాబితా సవరణ పూర్తికానుండగా, అనంతరం పోలింగ్ కేంద్రాల గుర్తింపు, డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ఖరారు వంటి ప్రక్రియలను వేగవంతం చేయనున్నారు. అన్ని ఏర్పాట్లు అనుకున్నట్లుగా పూర్తయితే నవంబర్ తొలి లేదా రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

    ఇక రాజకీయంగా కూడా ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓఆర్‌ఆర్ పరిధిలోని పలు మున్సిపాలిటీలను విలీనం చేసి జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీగా పునర్వ్యవస్థీకరించడంతో నగర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. దాదాపు 28 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఆధిపత్యం చాటుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ముందుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసిన తర్వాతే మిగిలిన రెండు కార్పొరేషన్ల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    IPL Final Live: Dominant Bengaluru face Gujarat for their second consecutive title
    తర్వాత ఆర్టికల్
    Stock market recap: Seven of top-10 firms lose Rs 1.54 lakh crore

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి