శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    hybrid mutual funds : హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడుల జోరు.. ఏడాదిలో రూ.1.55 లక్షల కోట్ల ప్రవాహం

    52 minutes ago

    మార్కెట్‌లో నెలకొన్న ఒడుదొడుకుల మధ్య హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలపై పెట్టుబడిదారుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాలు రూ.1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా, గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1.2 లక్షల కోట్లతో పోలిస్తే సుమారు 29 శాతం వృద్ధి నమోదైంది. ఈక్విటీ, డెట్‌ వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే హైబ్రిడ్‌ ఫండ్లు మార్కెట్‌ హెచ్చుతగ్గుల సమయంలో సమతుల్య రాబడులు అందించే అవకాశముండటంతో పెట్టుబడిదారులు వీటివైపు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

    పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో రిస్క్‌ను తగ్గించే పెట్టుబడి మార్గాల కోసం ఇన్వెస్టర్లు హైబ్రిడ్‌ ఫండ్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మల్టీ అసెట్‌ అలొకేషన్‌ ఫండ్లు మంచి ఆదరణ పొందుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో హైబ్రిడ్‌ పథకాల నిర్వహణలోని మొత్తం ఆస్తులు (AUM) 2024-25లో రూ.8.83 లక్షల కోట్ల నుంచి 2025-26 నాటికి రూ.10.35 లక్షల కోట్లకు పెరగడం ఈ విభాగంపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Heel Pain Is A Big Problem: सुबह उठते ही एड़ियों में होता है तेज दर्द, जानें यह किस बीमारी का संकेत?
    తర్వాత ఆర్టికల్
    Bobby breaks silence on rumours of conflict with Alia Bhatt on 'Alpha' set

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి