శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Health Risks of Wrong Medication : మందులు వాడేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. ఆరోగ్యానికి ముప్పు!

    47 minutes ago

    అనారోగ్యాన్ని తగ్గించడంలో మందులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వాటిని సరైన విధంగా తీసుకోకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది డాక్టర్ సలహా లేకుండానే జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలకు మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేసి వాడుతుంటారు. ముఖ్యంగా పిల్లలకు స్వయంగా మందులు ఇవ్వడం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడగానే యాంటీబయాటిక్ మందులను మధ్యలోనే ఆపేయడం వల్ల ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గక మళ్లీ తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

    మందులను సమయానికి తీసుకోకపోవడం, ఖాళీ కడుపుతో వాడటం లేదా గడువు ముగిసిన మందులను ఉపయోగించడం కూడా ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా పెయిన్‌కిల్లర్స్‌ను అధికంగా వాడటం వల్ల కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. జెనరిక్‌, బ్రాండెడ్‌ మందులలో ఔషధ పదార్థం ఒకటే అయినప్పటికీ, ధర మరియు కంపెనీ పరంగా మాత్రమే తేడా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడటం ద్వారా మెరుగైన ఫలితాలు పొందడంతో పాటు అనవసర ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వారు సూచిస్తున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    IPL Final: Virat Kohli and Venkatesh Iyer come out swinging in chase
    తర్వాత ఆర్టికల్
    Best revenge K-dramas: 'My Name', 'Vincenzo', 'Taxi Driver', and more

    సంబంధిత లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి