శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Eluru Subramanyam : రాజ్యాంగం సామాన్యులకు న్యాయం అందించే విధంగా రూపొందించబడిందని యేలూరి సుబ్రహ్మణ్యం

    1 week ago

    కాకినాడ (తొలి ఉదయం): భారత రాజ్యాంగం స్వాతంత్ర్యానికి అసలు అర్థాన్ని ఇచ్చిన మహత్తర గ్రంథమని, సామాన్య ప్రజలకు న్యాయం అందేలా రూపుదిద్దించబడిందని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలూరి సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రధాన ప్రసంగం చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించిన తర్వాత, యేలూరి సుబ్రహ్మణ్యం రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైనది, చట్టం ముందు అందరూ సమానులనే సిద్ధాంతాన్ని స్పష్టంగా ప్రతిపాదించిన గొప్ప గ్రంథమని వివరించారు.

     

    రాజ్యాంగంలోని మౌలిక హక్కులు, దిశానిర్దేశక సూత్రాలు దేశ ప్రగతికి పునాదులని, వాటిని కాపాడటం ప్రతి న్యాయవాది కర్తవ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రత, సమానత్వం, లౌకికత వంటి విలువలను నిలబెట్టేందుకు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని యువ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Best constable award : ఉత్తమ కానిస్టేబుల్‌గా నాగమల్లేశ్వరరావుకు సేవా పురస్కారం
    తర్వాత ఆర్టికల్
    Bikina visvesvara : బీజేపీ సిద్ధాంతాలే భారత ప్రగతికి పునాది – బిక్కిన విశ్వేశ్వరరావు

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి