శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Bikina visvesvara : బీజేపీ సిద్ధాంతాలే భారత ప్రగతికి పునాది – బిక్కిన విశ్వేశ్వరరావు

    1 week ago

    కాకినాడ (తొలి ఉదయం): భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి స్థానిక రామారావు పేట బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించిన ఆయన, రాజ్యాంగ విలువలు, జాతీయ సమగ్రత, స్వయం ఆధారిత భారత నిర్మాణమే బీజేపీ సిద్ధాంతాల సారమని పేర్కొన్నారు.

     

    అయితే, “సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయత్న్” నినాదాలతో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ఉన్నదని, జనధన్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్, హర్ ఘర్ జల్, పీఎం ఆవాస్ యోజన, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు పేదలు, మధ్యతరగతి, యువత, మహిళలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుస్తున్నాయని ఆయన వివరించారు. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం, సాంకేతిక అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చరిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు.

     

    ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, యువ మోర్చా, మహిళా మోర్చా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జైహింద్ నినాదాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Eluru Subramanyam : రాజ్యాంగం సామాన్యులకు న్యాయం అందించే విధంగా రూపొందించబడిందని యేలూరి సుబ్రహ్మణ్యం
    తర్వాత ఆర్టికల్
    Brooklyn Beckham and Nicola Peltz combined net worth

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి