శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Supreme Court Begins SIR Hearing : పశ్చిమ్ బెంగాల్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    1 రోజు క్రితం

    పశ్చిమ్ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన ధర్మాసం ఈ కేసును విచారించింది. 1.36 కోట్ల మంది ఓటర్లను ‘తార్కిక వ్యత్యాసాల’ పేరుతో జాబితా నుంచి తొలగించారని, ఇంటిపేర్లలో అక్షరదోషాలు లేదా వివాహానంతరం చిరునామా మార్పుల వంటి చిన్న కారణాలతో అర్హుల పేర్లు తీసేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. న్యాయం మూసిన తలుపుల వెనుక దుఃఖిస్తోందని, తమకు న్యాయం జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

    అలాగే, 8,300 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మైక్రో-అబ్జర్వర్లుగా నియమించి, రాజ్యాంగ విరుద్ధంగా ఓటరు జాబితాల నుంచి పేర్లు తొలగిస్తున్నారని దీదీ విమర్శించారు. దీనిపై స్పందించిన సీజేఐ ధర్మాసనం, అవసరమైతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేస్తూనే, SIR ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులను అనుమతించబోమని వ్యాఖ్యానించింది. మైక్రో-అబ్జర్వర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు లేఖలు రాసినా స్పందన లేకపోవడంతోనే కేంద్ర ఉద్యోగులను నియమించాల్సి వచ్చిందని ఈసీ తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఎన్నికల సంఘం ఎప్పుడూ గ్రూప్-బి అధికారులను కోరలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అభ్యర్థన చేయలేదని బెంగాల్ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ స్పష్టం చేశారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Stock market today: Top gainers and losers on Nifty50 and Sensex; check list
    తర్వాత ఆర్టికల్
    Pollution needs year-round action, says CM as Delhi gets six new air monitoring stations

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి