శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Modi Expresses Concern Over West Asia Tensions పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన – శాంతికి భారత్ పిలుపు, కెనడాతో కీలక ఒప్పందాలు

    1 hour ago

    పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై Narendra Modi ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఎప్పుడూ శాంతి, దౌత్యం, చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం కావాలనే అభిప్రాయంతో ఉందని స్పష్టం చేశారు. భారత్ పర్యటనలో ఉన్న Mark Carneyతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలైజేషన్ వంటి సవాళ్లు ప్రపంచ దేశాలన్నింటికీ ముప్పుగా మారాయని పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపులను సమష్టిగా ఎదుర్కొనేందుకు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని, ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు భారత్ కట్టుబడి ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు.

     

    ఇక అమెరికా మద్దతుతో Israel గత శనివారం Tehranలో 30 ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత Ali Khamenei మరణించారని వార్తలు వెలువడగా, ప్రతిగా Iran ఇజ్రాయెల్ లక్ష్యాలపై, అలాగే అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ దాడులు చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ శాంతియుత పరిష్కారానికి పిలుపునిచ్చారు. మరోవైపు, కెనడా ప్రధాని పర్యటన సందర్భంగా విద్యుత్, టెక్నాలజీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరుదేశాలు నిర్ణయించగా, గ్లోబల్ బయోఫ్యూయల్ కూటమిలో చేరేందుకు కెనడా అంగీకరించింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    All about Iran’s late supreme leader Ayatollah Ali Khamenei's wife and children
    తర్వాత ఆర్టికల్
    US-Israel-Iran war: What’s the impact on India? Explained in top 5 points

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి