శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Sonar Bangla : బెంగాల్ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన Narendra Modi.. ‘సోనార్ బంగ్లా’ హామీ

    2 hours ago

    పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని Narendra Modi బెంగాల్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ, మరికొద్ది నెలల్లో జరిగే కీలక ఎన్నికలు భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

    ‘జై మహాకాళి’ అంటూ లేఖను ప్రారంభించిన మోదీ, “మీరు తీసుకునే తెలివైన నిర్ణయంపైనే భావితరాల దిశ ఆధారపడి ఉంటుంది. యువకులు, మహిళలు, పెద్దలు కలలుకన్న ‘సోనార్ బంగ్లా’ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాను. వికసిత్ బంగ్లా సాధనకు తీర్మానం చేసుకున్నాను” అని పేర్కొన్నారు.

    గత 11 ఏళ్లుగా ప్రజల ఆశీస్సులతో ఎన్డీయే ప్రభుత్వం ప్రజాసంక్షేమం, దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు. రైతుల సంక్షేమం నుంచి మహిళా సాధికారత, యువత అభివృద్ధి వరకు పలు కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.

    కేంద్ర పథకాల లబ్ధి వివరాలు:

    ‘జన్-ధన్ యోజన’ ద్వారా సుమారు 5 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు

    ‘స్వచ్ఛ భారత్’ కింద 85 లక్షల మరుగుదొడ్లు నిర్మాణం

    చిన్న వ్యాపారులకు రూ.2.82 లక్షల కోట్ల రుణాలు

    56 లక్షల మందికి ‘అటల్ పెన్షన్ యోజన’ లబ్ధి

    ‘ఉజ్వల యోజన’ కింద కోటికి పైగా ఎల్పీజీ కనెక్షన్లు

    ‘కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా 52 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం

    బెంగాల్ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, అయినప్పటికీ కేంద్రం ప్రజాసంక్షేమానికి కట్టుబడి ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు.  నేతాజీ Subhas Chandra Bose పుట్టిన నేలలో అక్రమ చొరబాట్లు, మహిళలపై హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కవి Rabindranath Tagore కలలుగన్న ‘సోనార్ బంగ్లా’ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.   “మార్పు అనివార్యం. 2026లో వికసిత్ వెస్ట్ బెంగాల్ సాధన కోసం అందరూ కలిసిరావాలి” అని ప్రధాని తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Neeraj Pandey to direct RD Burman biopic, casting in progress - Reports
    తర్వాత ఆర్టికల్
    After 'slogger' remark, Pakistan's Amir makes fresh Abhishek admission

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి