శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Republic Day celebrations in kanchikacherla : ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

    1 వారం క్రితం

    ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. కంచికచర్లలో జనవరి 26 తొలిఉదయం స్థానిక మార్కెట్ యార్డ్ నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ కమిటీ చైర్మన్ల సంఘం ఉపాధ్యక్షులు కోగంటి బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పలువురు దేశ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు చేసిన అపార త్యాగాల ఫలితంగానే నేడు గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. గణతంత్ర దినోత్సవం కోట్లాది మంది త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని, భారతదేశానికి స్వేచ్ఛ, సమత్వం, సమాన హక్కులు అందించిన పవిత్రమైన దినమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు తోట రవి, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Budget 2026: Tax reforms, customs rationalisation and fiscal reset on the agenda
    తర్వాత ఆర్టికల్
    Amma Foundation: కిడ్నీ వ్యాధిగ్రస్తునికి రూ.40 వేల ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి