శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Amma Foundation: కిడ్నీ వ్యాధిగ్రస్తునికి రూ.40 వేల ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్

    1 వారం క్రితం

    కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.40 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామానికి చెందిన కాశీరావుకు రెండు కిడ్నీలు పూర్తిగా పాడై తీవ్ర అనారోగ్యానికి గురవడంతో పాటు, వైద్యం కోసం అవసరమైన ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, కొమరోలు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ స్పందించారు. సోమవారం నంద్యాలలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న కాశీరావును పరామర్శించిన ఆయన, ఆరోగ్య పరిస్థితి మరియు కుటుంబ ఆర్థిక స్థితిని తెలుసుకుని రూ.40 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

     

    ప్రస్తుతం కాశీరావు నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిరంతర వైద్య ఖర్చులతో కుటుంబ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్న నేపథ్యంలో ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కష్టకాలంలో ఆదుకున్న అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్‌కు, అలాగే ఫౌండేషన్ బృందానికి కాశీరావు కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

     

    ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ పందనబోయిన భూపాల్‌తో పాటు సభ్యులు కాశీరావు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Republic Day celebrations in kanchikacherla : ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు
    తర్వాత ఆర్టికల్
    Budget 2026 expectations: Private space firms seek procurement push, critical infrastructure status for sector

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి