kntv
kntv

వైరా కట్టలేరుకు పోటెత్తిన వరద....

1 hour ago

నందిగామ మండలం దాములూరు వద్ద ఉన్న వైరా కట్టలేరు కు వరద నీరు పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులోకి భారీగా వరద నీరు చేరడంతో రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో నందిగామ–వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.