శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    PawanKalyan : ఫైళ్ల క్లియరెన్స్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టమైన ఫోకస్

    2 వారాలు క్రితం

    అమరావతి:
    రాష్ట్ర పరిపాలనకు వేగం తీసుకురావాలనే లక్ష్యంతో డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ ఫైళ్ల క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. తన శాఖకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లను స్వయంగా పరిశీలిస్తూ, కీలక అంశాలపై లోతైన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ-ఫైలింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై ఆలస్యం లేకుండా స్పష్టతతో చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

    వారంలో 3–4 రోజులు సచివాలయంలో హాజరు

    పరిపాలనలో జాప్యాన్ని తొలగించి ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలనే ఉద్దేశంతో, వారంలో మూడు నుంచి నాలుగు రోజులు సచివాలయానికి హాజరుకావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

    పరిపాలనలో కొత్త దిశ

    పెండింగ్ ఫైళ్లను వేగంగా పరిష్కరించడం, డిజిటల్ పాలనను ప్రోత్సహించడం ద్వారా పరిపాలనలో పారదర్శకత, సమర్థత పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్యలు ప్రభుత్వ వ్యవస్థకు కొత్త ఊపునిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Masaba disables Instagram comments after Kangana’s allegation?
    తర్వాత ఆర్టికల్
    Mla Tangirala Sowmya : సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి