శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Nirmala Sitharaman : సంస్కరణలతో స్థిరమైన ఆర్థిక వృద్ధే లక్ష్యం: బడ్జెట్ 2026పై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు

    5 రోజులు క్రితం

    న్యూఢిల్లీ 

    సంస్కరణల ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఉత్పాదకతను పెంచడం, ఉపాధి అవకాశాలు కల్పించడం పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు.

     

    వరుసగా తొమ్మిదోసారి లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌–2026ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 85 నిమిషాల పాటు ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, 21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా ముందుకు సాగుతోందని, అందువల్ల సాంకేతికతను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.

     

    ఈ లక్ష్యంతో టైర్-2, టైర్-3 నగరాల అభివృద్ధికి ఏటా రూ.1,000 కోట్ల చొప్పున కేటాయింపులు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ నిధులు సాంకేతిక ఆధారిత వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ ప్రణాళిక బలోపేతానికి వినియోగించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఆయా నగరాలు వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు.

     

    బడ్జెట్‌లో సెమీకండక్టర్ రంగానికి సంబంధించి రెండు కీలక ప్రకటనలు చేసినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. దీని ద్వారా మినరల్స్ రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధిస్తుందని, మేగ్నెట్లు, రేర్ ఎర్త్స్‌పై విదేశీ ఆధారపడటం తగ్గుతుందని వివరించారు.

     

    అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు, ఆహార పదార్థాల దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును బడ్జెట్‌లో ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ఈ జాబితాలో అదనంగా ఏడురకాల అరుదైన వ్యాధులను చేర్చినట్లు చెప్పారు. ఇది బాధితులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.

     

    అదేవిధంగా 17 రకాల క్యాన్సర్ నిరోధక ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా రద్దు చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ నిర్ణయం క్యాన్సర్ చికిత్సను మరింత చవకగా మార్చడంలో కీలకంగా నిలుస్తుందని ఆమె అన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    "I know hunger, have worn discarded clothes": How a Mumbai man turned his struggles into a lifetime of giving
    తర్వాత ఆర్టికల్
    High-Density Cultivation Push In Budget 2026 May Help Kashmir Compete With California, Chile Walnuts

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి