శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Mumbai Mayor : ముంబయి మేయర్ ఎన్నిక: మహాయుతి కూటమిలో ప్రతిష్టంభనకు తెర, బీజేపీకి మేయర్ పీఠం

    3 days ago

     ముంబయి: ముంబయి మేయర్ ఎన్నిక విషయంలో మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమిలో కొనసాగిన ప్రతిష్టంభనకు దాదాపు తెరపడింది. ఫిబ్రవరి 11న జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం అధికార కూటమి తన అభ్యర్థులను ఖరారు చేసింది. మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డేను, డిప్యూటీ మేయర్‌గా శివసేన (షిండే వర్గం) కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘడీని ప్రతిపాదించింది. అగ్ర నాయకత్వంతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ, శివసేన నేత అమిత్ సతమ్ వెల్లడించారు.

    జనవరి 15న జరిగిన బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఘాట్‌కోపర్ డివిజన్ నుంచి రీతూ తావ్డే విజయం సాధించారు. మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె బీఎంసీ విద్యా కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. సంజయ్ శంకర్ ఘడీ ఐదో నెంబర్ డివిజన్ నుంచి గెలిచారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం నలుగురు కార్పొరేటర్లు పోటీలో ఉండటంతో మొదట సంజయ్‌కు అవకాశం ఇవ్వగా, ఆయన 15 నెలల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ నలుగురు 2022లో శివసేనను ఏక్‌నాథ్ షిండే చీల్చిన సమయంలో ఆయన వెంట వచ్చినవారే.

    మొత్తం 227 సభ్యులున్న బీఎంసీలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ 89, శివసేన (షిండే) 29 స్థానాలతో కలిపి కూటమి 118 సీట్లు గెలుచుకుంది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) 65, కాంగ్రెస్ 24, ఎంఐఎం 8, ఎంఎన్‌ఎస్ 6, ఎన్సీపీ (అజిత్ పవార్) 3, ఎన్సీపీ (శరద్ పవార్) 1, ఇతరులు మిగతా స్థానాల్లో గెలిచారు. దీంతో దేశంలో అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన ముంబయిలో 23 ఏళ్ల తర్వాత శివసేనకు మేయర్ పీఠం దక్కకుండా పోయింది. 1997 నుంచి ఇప్పటి వరకూ బీఎంసీ మేయర్ పదవి శివసేన వద్దే ఉండేది. ఫలితాల అనంతరం షిండే వర్గం క్యాంపు రాజకీయాలు చేసినా, చివరకు మేయర్ పీఠం బీజేపీకే దక్కనుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    IND vs USA LIVE: All eyes on SKY as India look for strong finish
    తర్వాత ఆర్టికల్
    IND vs USA LIVE: SKY show powers India to 161/9 in 20 overs

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి