శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Mana Mitra WhatsApp Platform : మన మిత్ర వాట్సాప్‌తో రైతులకు పేపర్‌లెస్ సేవలు.. APMIP సేవలు మరింత సులువు: మంత్రి అచ్చెన్నాయుడు

    12 hours ago

    అమరావతి, ఫిబ్రవరి 10:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వేగవంతమైన, పారదర్శకమైన మరియు పేపర్‌లెస్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ‘మన మిత్ర’ వాట్సాప్ ఆధారిత గవర్నెన్స్ ప్లాట్‌ఫారంలో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (APMIP)ను సమగ్రంగా అనుసంధానం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ, రైతులు తమ మొబైల్ ఫోన్ ద్వారా 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ పంపి, ఉద్యానవన శాఖ (APMIP)ను ఎంపిక చేసుకోవడం ద్వారా అనేక కీలక సేవలను ఇంటి నుంచే పొందవచ్చన్నారు. సబ్సిడీ కోసం నమోదు, దరఖాస్తు స్థితి తెలుసుకోవడం, గ్రీవెన్స్ నమోదు, నాన్-సబ్సిడీ చెల్లింపులు వంటి సేవలు ఇప్పుడు పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.

    హార్టికల్చర్ శాఖ పరిధిలో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్‌లు, సోలార్ పంపులు వంటి మైక్రో ఇరిగేషన్ పరికరాలను ఆన్లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయంతో పాటు, నగదు చెల్లింపులు కూడా సురక్షితంగా ఇంటి నుంచే చేసే వీలును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ డిజిటల్ వ్యవస్థల ద్వారా రైతుల సమయం, ఖర్చు రెండూ గణనీయంగా ఆదా అవుతాయని, వ్యవహారాల్లో పారదర్శకత పెరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

    ‘మన మిత్ర’ ప్లాట్‌ఫారమ్ వినియోగం రైతుల్లో మరింత విస్తరించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న దూరదృష్టి నిర్ణయాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ మంచి ఫలితాలు ఇస్తున్నాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Cancer Warning Symptoms: देश में हर साल बढ़ रहे कैंसर के 15 लाख मामले, जानें जानलेवा बीमारी के 3 सबसे कॉमन लक्षण
    తర్వాత ఆర్టికల్
    'Not going to be easy': Ganguly warns Pakistan in high-stakes World Cup showdown

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి