శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Maharashtra first woman Deputy Chief Minister : మహారాష్ట్రకు తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్

    6 రోజులు క్రితం

    ముంబై, శనివారం:

    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత, రాజ్యసభ ఎంపీ, దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister)గా శనివారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని లోక్‌భవన్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, మహాయుతి కూటమి మంత్రులు, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. అయితే ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేత శరద్ పవార్, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

     

    సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందడంతో, ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను సునేత్ర పవార్ స్వీకరించారు. రాజకీయ అనుభవంతో పాటు పరిపాలనపై అవగాహన కలిగిన నేతగా పేరొందిన సునేత్ర పవార్, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని మహాయుతి నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళా నాయకత్వానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Court RESTRAINS Abhinav from making remarks against Salman
    తర్వాత ఆర్టికల్
    Ind vs NZ: India win toss, opt to bat first

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి