శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    LokSabha Speaker Om Birla : స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. 119 మంది ఎంపీల సంతకాలు

    11 hours ago

    న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:
    లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు సమర్పించారు. మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఈ నోటీసులు అందజేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసులపై మొత్తం 119 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ అవిశ్వాస నోటీసులపై కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీలు సంతకాలు చేశారు. అయితే ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు మాత్రం ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈ అవిశ్వాస నోటీసులపై సంతకం చేయడానికి నిరాకరించినట్లు సమాచారం.

    సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, స్పీకర్ ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎనిమిది మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేయడంపై కూడా విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె రాసిన పుస్తకంలోని అంశాలపై చర్చ జరగాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఎంపీలు నిరసనలకు దిగడంతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఈ ఘటనల నేపథ్యంలోనే స్పీకర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి పూనుకుంది.

    సాధారణంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నిబంధన ప్రకారం బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ఈ అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. లోక్‌సభ బడ్జెట్ తొలి విడత సమావేశాలు జనవరి 8న ప్రారంభమై ఫిబ్రవరి 13తో ముగియనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    T20 WC: New Zealand need 174 to beat UAE
    తర్వాత ఆర్టికల్
    Why Nick Jonas says becoming a dad changed his music and his mind

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి