శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Karnataka politics : కర్ణాటకలో కాంగ్రెస్ అధికార మార్పిడి.. సీఎం రేసులో డీకే శివకుమార్ ముందంజ

    1 hour ago

     

    కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్ఠానం కీలక కసరత్తు కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య అనంతరం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆయన రాజీనామాను ఆమోదించి రాష్ట్ర మంత్రివర్గాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని విధానసౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కొత్త సీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    రాజీనామా అనంతరం సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కే.సి. వేణుగోపాల్‌లతో సమావేశమయ్యారు. అధికార బదిలీని సజావుగా పూర్తి చేశానని ఆయన పార్టీ నాయకత్వానికి వివరించినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, తన రాజకీయ భవిష్యత్తు, మంత్రివర్గ కూర్పు వంటి అంశాలపై చర్చలు జరిగాయి. తన కుమారుడు యతీంద్రతో పాటు అనుచరులకు కూడా కొత్త మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పించాలని సిద్ధరామయ్య కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

    ఇదిలా ఉండగా, కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగాలని సిద్ధరామయ్య స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వ ప్రతిపాదనను కూడా ఆయన తిరస్కరించినట్లు సమాచారం. మరోవైపు కొత్త మంత్రివర్గంలో యువ నాయకులకు అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశం అనంతరం మంత్రివర్గ ఏర్పాటు, పార్టీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని డీకే శివకుమార్ వెల్లడించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Reema Kagti on nepotism debate: 'People outrage, but only...'
    తర్వాత ఆర్టికల్
    Marcia Lucas passes away at 80

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి