శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    INDvsNZ CricketSeries : 100 ఏళ్ల బంధానికి గుర్తుగా భారత్-న్యూజిలాండ్ మెగా సిరీస్.. 40 రోజుల్లో 12 మ్యాచ్‌ల క్రికెట్ జాతర!

    1 hour ago

    భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్ గడ్డపై 40 రోజుల సుదీర్ఘ పర్యటనకు సిద్ధమవుతోంది. ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలు ప్రారంభమై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు కొనసాగే ఈ పర్యటనలో 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్ చరిత్రలో ఏ దేశంతోనూ ఇంత పెద్ద ద్వైపాక్షిక సిరీస్ జరగకపోవడం విశేషం.

     

    2019-20 తర్వాత భారత జట్టు న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. మరోవైపు 2024-25లో భారత్‌ను సొంతగడ్డపై 3-0తో ఓడించిన న్యూజిలాండ్ జట్టు ఇప్పుడు తమ గడ్డపై కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. దీంతో ఈ సిరీస్‌పై ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నవంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టులు ఇరు జట్ల ప్రతిష్ఠాత్మక పోరుకు వేదిక కానున్నాయి. భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక కివీస్ మరోసారి సత్తా చాటుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Trump’s Forced Labour Tariffs Threaten Indian Exports. Can Trade Talks Prevent A Fallout?
    తర్వాత ఆర్టికల్
    DonaldTrump : భారత్ సహా 60 దేశాలపై కొత్త సుంకాలకు అమెరికా సిద్ధం.. వాణిజ్య రంగంలో మరోసారి ఉద్రిక్తతలు

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి